ప్రపంచంలో అనేక సూర్యదేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ దేశంలో సూర్యుడిని కొలుస్తుంటారు. ఇక పూర్వకాలంలో సూర్యుడికి నిత్యం పూజలు చేసే తెగలు అనేకం ఉన్నాయి. ఈజిప్ట్‌లో సూర్యుడిని వివిధ పేర్లతో పూర్వం కొలిచేవారు. ఆ దేశంలో సూర్యునికి అనేక ఆలయాలు నిర్మించారు. ఈజిప్ట్ పురావస్తుశాఖ నేతృత్వంలో అబు ఘరబ్ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఓ సూర్యుడి ఆలయం బయటపడింది. తవ్వకాల్లో బయటపడిన ఆ ఆలయం సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంగా పురావస్తు శాస్త్రవేత్తలు…