బ్రెజిల్‌లో ఓ మగశిశువు వైద్యులనే ఆశ్చర్యపోయేలా జన్మించాడు. ఎందుకంటే అతడు తోకతో పుట్టాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 ఏళ్ల గర్భిణీ పురుటినొప్పులతో ఆల్బర్ట్ సాబిన్ అనే పిల్లల ఆస్పత్రిలో చేరింది. సాధారణ కాన్పు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు నోరెళ్లబెట్టారు. 12 సెంటీమీటర్లు ఉన్న బాలుడి తోకకు చివరలో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉందని వైద్యులు…