టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయలకుపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలపై సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది.