ప్రముఖ టెలివిజన్ యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్ పై జనగామ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్‌కు వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఓ విషాద ఘటన జరిగింది. ఆయన కారు ఒక ఆటోను ఢీ కొట్టడంతో, ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులు మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి…