ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం… ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే…
మౌలిక సదుపాయల ఆధునీకరణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ చేయూత అందించనుంది. ఈ మేరకు 245 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1911 కోట్లు) రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు ముందుకొచ్చింది. ఏడేళ్ల గ్రేస్ పీరియడ్ సహా 22 ఏళ్లలో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. భారత్ చేపడుతున్న ‘రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్టు’కు ఈ నిధులు వినియోగించనున్నారు. సరకు రవాణా వేగవంతం, ప్రయాణికులను మరింత సురక్షితంగా, వేగంగా గమ్యం చేర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్…