Telangana Liquor Sales: తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ల(ఎన్‌బీఎఫ్‌సీల)ను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారీగా ఉండే డేటాబేస్‌ను విశ్లేషించేందుకు కూడా ఇవి అవసరమని భావిస్తోంది. ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌లను వాడనుంది.