Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.