బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన కన్నడ సినీ నటి, డీజీపీ కుమార్తె రన్యా రావును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సోమవారం విచారణకు హాజరైన సమయంలో రన్యా కోర్టులోనే ఏడ్చింది. ఈ క్రమంలో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనను వేధిస్తున్నారని.. తిట్టారని రన్యా రావు న్యాయస్థానానికి తెలిపింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని ముగ్గురు ఏసీపీలు విచారించారు. విచారణలో భాగంగా.. కీలకమైన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని వంశీ సమాధానం చెప్పారు. వంశీకి 20కు పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు.