జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల పైన సత్యదూరమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కనీసం అట్టి కరోనా వ్యాధిని ఆరోగ్య…
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ధి చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు.
శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్యని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను…
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. PAC చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంకి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కె పూడికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభలో PaC చైర్మన్ KC వేణుగోపాల్ కి ఇవ్వలేదా అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని లోక్ సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. రాష్ట్ర…
బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చర్య తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) స్వాగతించింది. హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. “ఈ తీర్పు కాంగ్రెస్ అప్రజాస్వామిక పద్ధతులకు గణనీయమైన ఎదురుదెబ్బ. పార్టీ మారిన వారు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తోంది. న్యాయస్థానం తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన…
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) స్పోర్ట్స్ అకాడమీల్లో నిమగ్నమైన క్రీడా కోచ్‌ల సేవలను కొనసాగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. తమ కోచ్‌లను ఆకస్మికంగా తొలగించడం వల్ల ప్రతికూలంగా ప్రభావితమైన విద్యార్థుల దుస్థితి సెప్టెంబర్ 6న ఈ కాలమ్‌లలో హైలైట్ చేయబడింది. సొసైటీ 28 క్రీడా అకాడమీలను నిర్వహిస్తోంది, గోల్ఫ్, క్రికెట్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ , జూడోతో సహా 12 విభాగాలను అందజేస్తూ 35 మంది కోచ్‌ల సేవలను గౌరవ వేతనం ఆధారంగా…
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజిలోని 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీలుతో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ఈ తీర్పు పై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు కాదు దీన్ని తుది తీర్పుగా భావించి ఉప ఎన్నికలు వస్తాయని కొన్ని పార్టీలు పండుగ చేసుకుంటున్నాయని, కానీ వారికి ఇంకా పైనా చాలా కోర్టులు ఉన్నాయన్న విషయం ఆ పార్టీ వాళ్లు విస్మరిస్తున్నారన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై డబుల్ బెంచ్‌కి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకెళ్లొచ్చు ఇలా చాలా…