వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్లో తెరికెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.. ఈ సినిమా స్టోరీ అందరికీ…
తెలంగాణను గుజరాత్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత సుంకె రవిశంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ మోడల్ దేశానికీ ఆదర్శంగా ఉంది.. అనేక పథకాలను చూసేందుకు గుజరాత్ వాళ్ళు తెలంగాణకు వచ్చారన్నారు. గుజరాత్ మోడల్ అని రేవంత్ అనడం వెనుక కారణాలు ఏంటి..? ఆరెస్సెస్ మూలాల ఉన్నాయి కాబట్టే రేవంత్ అలా అన్నారని సుంకె రవి శంకర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ…
తెలంగాణ రాష్ట్ర పర్యటన రెండో విడత మంగళవారం ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌కు వెళ్లి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రధాన మంత్రి అమ్మవారికి పట్టు చీర , ఇతర నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) ను ప్రారంభించేందుకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన మోడీ,…
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల తర్వాత, నగదు కొరతతో ఉన్న దేశం పగ్గాలను రెండవసారి స్వీకరించిన షరీఫ్ సోమవారం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు. Multi-Starrer Movie: టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్..…
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక…