దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022 ఆదివారం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు తళుక్కుమన్నారు. తెలుగులో పుష్ప ది రైజ్ చిత్రం మరియు తమిళంలో సురారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) కొనసాగాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు.