Apple Company: iPhoneలో ‘ఐ’ అంటే ఏమిటని అడిగితే చెప్పటానికేమీలేదు. ఎందుకంటే.. అదొక యాపిల్ కంపెనీ ఫోన్ మోడల్ పేరు మాత్రమే. కానీ.. భవిష్యత్తులో ఐఫోన్ అంటే ఇండియా ఫోన్ అని చెప్పుకునే రోజులు రానున్నాయనిపిస్తోంది. 2027వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వాడుకునే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుకానుండటమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ పర్సంటేజీ 5 కన్నా తక్కువగానే ఉన్నట్లు లేటెస్ట్ న్యూస్ చెబుతున్నాయి.