వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగింపుకు వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఈరోజు నుంచి 141 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు రానున్నాయి. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం…