పొగమంచు కారణంగా ప్రధాని మోడీ హెలికాప్టర్ ప్రయాణం ఆగిపోయింది. మోడీ శనివారం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. హైవే ప్రాజెక్టులను ప్రారంభించి.. అనంతరం బీజేపీ పరివర్తన్ సంకల్ప సభలో ప్రసంగించాల్సి ఉంది.
ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రతికూల వాతావరణం ఇబ్బందికి గురి చేసింది. గత కొద్దిరోజులుగా పొగ మంచు కారణంగా ఆయా రాష్ట్రాలు కొట్టిమిట్టాడుతున్నాయి. అయితే శనివారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు.