Bhu Bharathi Bill: భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని ఈ సందర్బంగా తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, లక్షలాది మంది ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ధరణిని అర్థరాత్రి ప్రమోట్ చేశారని, నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు…
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని... శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో... 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్…