గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు..
వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు భూఆక్రమణపై నేటి నుంచి సర్వే నిర్వాహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చింతకొమ్మదిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి 16.85 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి 21.4 ఎకరాలతో సహా సజ్జన విజయ్ కుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు గత సర్వేలో అధికారులు గుర్తించారు.…