చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే తమకు తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కబ్జాలపై 8712406899 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైడ్రాధికారులు వెల్లడించారు. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.