Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లడఖ్ అల్లర్ల నేపథ్యంలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చిక్కుల్లో పడ్డారు. గత కొద్ది రోజులుగా లడఖ్‌కురాష్ట్ర హోదా కల్పించాలని నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో లడఖ్‌లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.
భారత్‌లో నిన్నటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు.
Ladakh: లడఖ్‌కు రాష్ట్రహోదా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.