Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు.
Sonam Wangchuk: బుధవారంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ హింసాత్మక అల్లర్లు జరిగాయి. ఈ ఆందోళనల్లో నలుగురు మరణించడంతో పాటు 50కి పైగా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పాటు, భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. అయితే, ఈ హింసను ప్రేరేపించేలా చేశాడని లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టింది.
Sonam Wangchuk: పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను శుక్రవారం పోలీసుల అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ, రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు.