మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా? తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ…
ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు…
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ…