ఆ ఎస్పీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జిల్లాకు అడుగుపెట్టకముందే, ఆయన పనితీరు తెలిసి తలలు పట్టుకున్నారు. సరిగ్గా నెలకూడా గడవలేదు…ఆయనేంటో అధికారపార్టీ నేతలకు పూర్తిగా అర్థమై పోయింది. ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి అటుంచితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకే ఆ ఎస్పీ కొరుకుడు పడడం లేదట…ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లా పోలీస్ బాస్ గా కర్ణాటక క్యాడర్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారని…