పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ…
పోసాని కేసులో కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు ఆదోని పోలీసులు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.. ఈ రెండు పిటిషన్లపై రేపు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, పోసాని మురళి కృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది కర్నూలు కోర్టు..