Komaram Bheem: కొమురం భీం జిల్లాలో సంచారం చేస్తూ అందరిని హడలెత్తించిన ఏనుగు ఎట్టకేలకు సరిహద్దు దాటింది. 53 గంటల పాటు తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిద్రలేకుండా దడ పుట్టించింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి మరో రైతు బలైపోయాడు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఇవాళ (గురువారం) ఉదయం వెళ్లే క్రమంలో ఏనుగు ఒక్క సారిగా దాడి చేయడంతో.. పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు.