Kumaraswamy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు అభిప్రాయ బేధాలు లేవని.. తన తండ్రి తర్వాత అంతటి వారు కేసీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను తావిచ్చిన సంగతి తెలిసిందే.
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్…
ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్‌లపై నిఘాను ఉంచారని, ఫోన్‌లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను…