Sahasra murder case: నేరం చేయాలనే ఆలోచన వస్తే.. చేసేస్తారా? దానికి వయసుతో సంబంధం ఉండదా? కూకట్‌పల్లి సహస్ర మర్డర్ కేసులో ఇదే జరిగిందా? పక్కా మర్డర్ ప్లాన్ లేకపోయినా.. అడ్డం వస్తే అంతం చేయాలనే నిందితుని ధోరణి.. సహస్ర ప్రాణాలు బలిగొందా? అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది? పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలేంటి? అసలు నిందితుడు దేని కోసం అత్యంత కిరాతకంగా అమ్మాయిని చంపేశాడు? మైనర్ బాలుడు క్రూరంగా చంపడం వెనుక కారణాలేంటి?…
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు తాజాగా కీలక పరిణామాలను వెలుగులోకి తెచ్చారు.