దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతోంది. వరుసగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు హ్యుండై సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో పాటు తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు.…