ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్…