Banakacharla : రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ ఈనెల 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది.…