Heavy Floods: ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అలజడిగా మారడంతో మత్స్య కారుల వేటపై నిషేధం కొనసాగుతోంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల…