భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది. కప్ గెలిచి వారం అవుతున్నా.. సంబరాలు మాత్రం ఇంకా ఆగలేదు. క్రికెటర్ల సొంత రాష్ట్రాలు ఘనంగా సత్కరిస్తూ.. రివార్డులు, అవార్డులు ప్రకటిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్లేయర్ క్రాంతి గౌడ్‌ను సత్కరించింది. అంతేకాదు క్రాంతి కోరిక మేరకు బర్తరఫ్ అయిన ఆమె తండ్రిని తిరిగి పోలీసుగా పునర్నియమిస్తామని…