మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేయడంతో కొత్తపల్లిని జగన్ సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తనకు ఓట్లు పడతాయని మంగళవారం నాడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ ప్రకటించకుండా తాను వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.…
ఏపీలో కొత్త జిల్లాల అంశం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా జరిగిన ఘటన ఈ టాక్ నిజమే అనిపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి…
ఆయనో సీనియర్ నాయకుడు. ఆ జిల్లాలో ఒకానొక సమయంలో చక్రం తిప్పారు కూడా. భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ జీవితమే క్వశ్చన్ మార్క్‌గా మారిపోయింది. ఉన్నచోట ఇమడలేక.. పాతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? పార్టీ మార్పుపై మరోసారి దృష్టిపెట్టారా? కొత్తపల్లి సుబ్బారాయుడు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ఎదిగిన సుబ్బారాయుడు.. ప్రస్తుతం ఏ…