రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024 మొదటి రోజు శనివారం శంఖారావంతో ప్రారంభమైంది. వేలాది మందితో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడింది.…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ ఘనంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది.. తొలి రోజు అన్ని కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగి పోయాయి.. వేలాది మంది భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాలుపంచుకున్నారు.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవం ప్రారంభమైంది… కన్నులపండుగగా.. ఇల కైలాసంలో జరుగుతోన్న ఆ దీపాల ఉత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=5bjCLsDY210