కార్తిక మాసంలో ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే కోటి దీపోత్సవం 12వ రోజుకు చేరింది.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ దీపయజ్ఞం వేదికగా భక్తులతో కిటకిటలాడుతోంది.. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తు్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.