బండారు సత్యానందరావు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇన్నాళ్ళు సౌమ్యుడిగా పేరున్న బండారు తీరు ఈసారి మారిందన్న టాక్ బలంగా నడుస్తోంది నియోజకవర్గంలో. ఇప్పుడాయన ఏకంగా నాలుగు ముక్కలాట ఆడుతున్నారట. కూటమిలోని మూడు పార్టీల నాయకులను పక్కనపెట్టి... వైసీపీ వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారన్నది ఇప్పుడు కొత్తపేటలో హాట్ సబ్జెక్ట్. అధికారంలోకి వచ్చిన నాటినుండి చాటుమాటుగా కొనసాగుతున్న చెలిమి ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకల్లో బయటపడిందట.
మకర సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.