శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రధాని మహింద్రా రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మహింద్రా రాజపక్సతో పాటు…