కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి. ముక్కు, నోరూ మూసే విధంగా మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎక్కువ భాగం కరోనా వైరస్ ముక్కుద్వారానే శ్వాసవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. దీంతో ముక్కు కవర్ అయ్యే విధంగా మాస్క్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్‌ను తీయకూడదు. అయితే, తినే సమయంలోనూ, తాగే సమయంలోనూ మాస్క్‌ను తీయాల్సిన అవసరం ఉంటుంది. హోటల్స్‌కు వెళ్లిన సమయంలో మాస్క్ తీసేయ్యడం వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.…