CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవమైంది.. ఎస్సీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడ్డారు. చివరికి సర్పంచ్ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేశారు.. 15 మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్‌లో ప్రకటించనున్నారు. ఎవరి పేరు వచ్చినా గ్రామం మొత్తం సమిష్టిగా ఆ నిర్ణయాన్ని గౌరవించాలనేది గ్రామ నాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు.