Akkineni Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత…
సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా... సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది.
Posani Krihsna Murali Shocking Comments on Konda Surekha – Akkineni issue: అక్కినేని కుటుంబం vs కొండా సురేఖ వివాదం గురించి పోసాని కృష్ణమురళి స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తి తో పొడుస్తా అన్నాడని అన్నారు. నేను పవన్ ను గతంలో తిట్టినట్లు చూపిస్తే నేను లైవ్ లో గొంతు కోసుకుని చనిపోతాను పోసాని కృష్ణమురళి అన్నారు. గతంలో…
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై ఎంపీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. సమంత, ప్రకాశ్ రాజ్, చిరంజీవి, అమల, ఎన్‌టీఆర్, నాని, అల్లు అర్జున్, చిరంజీవి, నాగ చైతన్య, ఖుష్బూ, ఆర్జీవీ, రామ్ చరణ్, మహేశ్ బాబు కొండా సురేఖను గౌరవప్రదమైన స్తానంలో…
రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్! కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం…
కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్..…
తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకుల పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ స్వార్ధ రాజకీయాల కోసం సినిమా వాళ్ళను టార్గెట్ చేయకూడదని దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడ్ హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురు తండ్రిగా, భార్యకు భర్తగా,…