Nagarjuna Statement Against Konda Surekha: నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరుగుతోంది. నాంపల్లి కోర్టుకు సినీ నటుడు నాగార్జున హాజరు కాగా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది కోర్టు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును నాగార్జున ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా ఈ రోజు కోర్టులో హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో నాగార్జున వెంట అమల, నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ కూడా కోర్టుకు హాజరయ్యారు. నేరుగా తన స్టేట్ మెంట్ ఇస్తున్నారు నాగార్జున. దేని కోసం పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జునను కోర్టు ప్రశ్నించగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం కలిగిందని, తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున అన్నారు.
Tumbbad: రీ-రిలీజ్‌లో దుమ్ము రేపిన తుంబాద్
సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం, మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడటం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని నాగార్జున డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు, రాజకీయ దురుద్దేశ్యంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అని నాగార్జున పేర్కొన్నారు. ఆమె మాటల కారణంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేశాయి, అన్ని పేపర్స్ ప్రచురితం చేశాయి అని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశాడు.