Minister Konda Surekha Apologizes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర సేపు రాజకీయాంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది.