ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు పరుస్తోందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ విద్యుత్ రంగంలో దూసుకుపోతుంటే, ఏపీ చీకట్లో మగ్గుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం సిగ్గుపడాలన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. 2014-19లో చంద్రబాబు ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే, ఈ సీఎం అంతా అంధకారం చేశారని మండిపడ్డారు. విద్యుత్ లేనందున రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడంలేదు. ఏపీలో భూముల విలువ పడిపోయిందని, కరెంట్ కోతలు ఉన్నాయని కేసీఆర్ హేళన చేస్తుంటే, జగన్ ఎందుకు స్పందించరు..? కేసీఆర్‌కు శాలువాలు కప్పితే, ఏపీ అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి గ్రహించాలి.…