కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీనేతలు మండిపడుతూనే వున్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా, ఆందోళనలకు దిగింది. ఇవాళ పోలీస్ కమిషనరేట్ల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేయనుంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా పోలీస్ కమీషనరేట్స్…
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాలుగా వున్నారనే ప్రచారం వుంది. తాజాగా వీళ్ళిద్దరూ ఐక్యతారాగం వినిపించారు. కలిసి కనిపించారు. తెలంగాణలో పీసీసీ పీఠం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకరికి పదవి దక్కగానే.. మరొకరు ఒంటికాలిపై లేచారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. కానీ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తారు. మనసులు కలిశాయా.. మనుషులు కలిశారా అని అనుకుంటున్న తరుణంలోనే చర్చల్లోకి వస్తారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్న…