ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమాకి.. కొత్త మోడల్ క్యాట్ 3.0 ఎన్‌ఎక్స్‌టిని పరిచయం చేసింది. CAT 3.0 NXT యొక్క కొత్త మోడల్ గ్రాఫేన్, LIPO4 అనే రెండు బ్యాటరీ వేరియంట్‌లను తీసుకు వస్తుంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ కోమకి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కోమాకి ఇండియా తన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా నిర్ణయించారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పటికే మోపెడ్, స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్లు, హై స్పీడ్ స్కూటర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.…