కొవిడ్ తమిళనాట కూడా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి తమిళ దర్శకుడు తమిర కన్నుమూశారు. కె. బాలచందర్, భారతీరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తమిర 2010లో ‘రెట్టైసుళి’ చిత్రం రూపొందించారు. విశేషం ఏమంటే ఇందులో ఆయన గురువులు బాలచందర్, భారతీరాజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించాడు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా పెద్దంత విజయం సాధించలేదు. 2018లో తమిర ‘ఆన్ దేవతై’ పేరుతో మరో…