కోల్‌కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్‌కతా వీధులన్నీ జలమయం అయ్యాయి. బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్‌పూర్‌లో వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీనజీవనం స్తంభించింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కోత్రా గ్రామంలో కొంత మంది ఇంటి పైకప్పుపై ఉన్నారనే సమాచారంతో.. వారిని తీసుకొచ్చేందుకు మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బోటుపై అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బోటుకు అడ్డుగా చెట్టుకూలిపోవడంతో.. ఆయన చిక్కుకుపోయారు. ఈ సమయంలో తమను రక్షించాలంటూ అధికారులకు మెసేజ్‌లు పెట్టారు.…