ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ను.. దాని సొంతగడ్డ హైదరాబాద్‌లో ఆర్సీబీ గెలిచింది. 207 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ (51). అయినా కూడా విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ 43 బంతుల్లో…