Kohli-Gavaskar: జట్టు కోరుకుంటోంది ఇది కాదు.. కోహ్లీపై గవాస్కర్ విమర్శలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ను.. దాని సొంతగడ్డ హైదరాబాద్‌లో ఆర్సీబీ గెలిచింది. 207 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ (51). అయినా కూడా విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విరాట్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 118 మాత్రమే. దాంతో విరాట్ ఆటతీరుపై టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు చేశారు. విరాట్ కొట్టిన హాఫ్ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగిందన్నారు. జట్టు అతడి నుంచి కోరుకుంటోంది ఇది కాదు అని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా ఉన్న సన్నీ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Rahul Dravid: క్యూలైన్‌లో నిల్చొని ఓటేసిన టీమిండియా కోచ్.. వీడియో వైరల్!
‘విరాట్ కోహ్లీ కేవలం సింగిల్స్ మాత్రమే తీశాడు. దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి విరాట్ కొన్ని రిస్క్ షాట్లను ప్రయత్నించాలి. రజత్ పాటిదార్‌ను చూడండి. ఓ ఓవర్‌లో అప్పటికే మూడు సిక్సర్లు బాదాడు. కావాలనుకుంటే అతను సింగిల్ తీయగలడు. కానీ అతడు అలా చేయలేదు. మరో భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బెంగళూరుకు కావాల్సింది అదే. కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు కానీ.. మధ్యలో లయ కోల్పోయినట్లు కనిపించింది. 31 పరుగుల నుంచి ఔట్ అయ్యే వరకూ ఒక్క బౌండరీ కొట్టలేదు. అతడి స్ట్రైక్ రేట్ 118. జట్టు విరాట్ నుంచి కోరుకుంటోంది ఇది కాదు. కోహ్లీ పెద్ద షాట్లను ప్రయత్నించాలి’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!