మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు. సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే…
ఒక్క రక్తపు బొట్టు నేల చిందకుండా సాకారమైన ఆశయం. పిల్లల నుంచి పెద్దల వరకు, స్కూల్ విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయం స్కాలర్ వరకు, కూలీ నుంచి ఉన్నతాధికారి వరకు, ప్రతి ఒక్కరూ ఉద్యమ పతాకలైన సందర్భం తెలంగాణ ఉద్యమం. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు… కొన్ని రక్తపు నేలలపై నడిచి యుద్ధాలుగా ముగిశాయి. కొన్ని లక్ష్య తీరాలను చేరి.. శాంతి పోరాటాలుగా భాసిల్లాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ రెండు మార్గాలూ కనిపిస్తాయి. అతి, మిత వాదుల…
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కామారెడ్డిలో జలసాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తూ తూప్రాన్ బైపాస్ లో TJS అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడారు. నీళ్లు , నిధులు, నియామకాల్లో టీఆర్‌స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. ప్రగతి భవన్ లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. మిగతా వారు ప్రగతి భవన్ కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు నమోదు. ధర్నా చౌక్ లు…