CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతాకు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి…