Will KKR Get ₹9.20 Crore Refund?: బీసీసీఐ అకస్మాత్తుగా ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడిమారీ రూ.9.20 కోట్లకు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్‌ను దక్కించుకున్న కేకేఆర్.. చిక్కుల్లో పడింది.